ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు
చిరునవ్వుల దీపం వెలిగించు
నీ బాధలకీ గతి తొలగించు
చిరునవ్వుల బాణం సంధించు
శత్రువులే ఉండరు గమనించు
మనిషన్నోడే మనసారా తానే నవ్వొచ్చు
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించు
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చు
నీతో పాటే తన కష్టం మరవచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు
నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా పెదవుల్లో నవ్వే వాటికి మందు
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా అదరాల నవ్వే వాటికి హద్దు
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్ర పోయేట్టు
సరిగ్గా నీ నవ్వుని నిచ్చెన చేసి ఎక్కడ పై మెట్టు
నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించు
ఈ పాఠం నువ్వే పాటించు
పది మందికి నువ్వే చాటించు
ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు
ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడిపించి కసితీరా నవ్విస్తుంది లోకం
నవ్వే వాళ్ళుంటే నవ్వులు నటించి కడుపారా ఏడుస్తుంది కాలం
కనుకే లోకాన్ని ఎదిరించేటి మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్ని ఎదిరించేటి ధైర్యం చూపెట్టు
ఈ జీవితం సత్యం గుర్తించు
ఆనందం నీవై జీవించు
నీ చలనం నువ్వే గమనించు
సంచలనం నువ్వే సృష్టించు
ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు